పెద్దవాళ్ళు డిప్రెషన్ నుండి బయట పడాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రజల్లో మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. బయట ఉండే సమస్యల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది దీనితో మానసిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

 

అయితే పెద్దవాళ్లలో డిప్రెషన్ సమస్య ఉంటే ఈ టిప్స్ బాగా పనిచేస్తాయని.. వీటిని ఫాలో అయితే డిప్రెషన్ సమస్య నుండి బయట పడవచ్చు అని మానసిక నిపుణులు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

పెద్దవాళ్లలో డిప్రెషన్ కనుక వచ్చిందంటే అది జీవితం యొక్క నాణ్యతని తగ్గిస్తుంది. ఏది ఏమైనా పెద్ద వాళ్ళు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పెద్దవాళ్లు డిప్రెషన్ కి గురి అయితే ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని ముఖ్యమైన టిప్స్ ని ఇచ్చింది. డిప్రెషన్ కనుక పెద్దవాళ్లలో ఉంటే ఇది బాగా వర్క్ అవుట్ అవుతాయి అని చెప్పింది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నమ్మే వ్యక్తితో మీ ఆరోగ్యం గురించి షేర్ చేసుకోండి. మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే.
అలానే సోషల్ వర్కర్, సైకలాజికల్ కౌన్సిలింగ్, డాక్టర్ ఇలా ఎవరూ మీ సమీపంలో ఉంటే వాళ్ళని
కన్సల్ట్ చేసి మంచి గైడెన్స్ తీసుకోండి.
మీరు మీకు నచ్చే వ్యక్తులు దగ్గర నుంచి దూరంగా వెళ్లి పోవడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం ఇలాంటివి చేస్తే డిప్రెషన్ తగ్గదు అని గమనించండి.
అలాగే వ్యాయామం లేదా హాబీస్ వంటి వాటి ద్వారా పాజిటివ్ గా ఉండొచ్చు. అలానే కాసేపు నడవడం లాంటివి చేస్తే కూడా డిప్రెషన్ సమస్య తగ్గుతుంది.
ప్రతిరోజు సరిగ్గా తినడం, నిద్రపోవడం చాలా ముఖ్యం. ఆహారాన్ని అసలు తినకుండా ఉండద్దు.
అదే విధంగా డ్రగ్స్, మందు వంటివాటికి బానిసలైపోకండి.
మీకు కనుక ఒకవేళ మోటివేషన్ లేకపోయినా మీకు నచ్చిన వాటిని మీరు చేయండి. పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి.
అలానే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఇలా కూడా మీరు పాజిటివ్ గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version