BREAKING : భాగ్యనగర వాసులారా.. నుమాయిష్‌ ప్రారంభమైంది

-

82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) 2023ను ఆదివారం సాయంత్రం 5గంటలకు ఎగ్జిబిషన్‌ మైదానంలో మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని అన్నారు. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగునున్నది. 1938లో వంద స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్‌ ప్రారంభం కాగా.. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నుమాయిస్‌ భారీగా ప్రజాదరణ పొందిందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని చెప్పారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, సొసైటీ ద్వారా 10వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు.


ప్రారంభంలోనే 60శాతం స్టాల్స్‌ నిండిపోయాయని, అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ దర్శనమిస్తాయన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఎంతో మంది వ్యాపారులు ఇక్కడకు వస్తారని, 30వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా విద్యనందిస్తున్నారన్నారు. మహిళల చదువుకు సొసైటీ పెద్దపీట వస్తుందన్నారు. సొసైటీలో చదివిన వారంతా ఎంతో మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారని తెలిపారు. పదివేల మంది సొసైటీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం 45 రోజుల పాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌కు సహకరించిన సహచర మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని హెల్త్‌ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version