అక్టోబర్లో యుపిఐ లావాదేవీలు 2 బిలియన్లు…!

2020 అక్టోబర్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ఆధారిత లావాదేవీల సంఖ్య 2 బిలియన్ల మార్కును దాటాయి అని… నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సోమవారం తెలిపారు. అక్టోబర్ 2020 లో, యుపిఐ 2.07 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది అని ఆయన వివరించారు. 2019 అక్టోబర్‌ లో 1.14 బిలియన్ లావాదేవీలు నమోదు అయ్యాయి అని ఆయన వివరించారు.

అప్పటి నుంచి యుపిఐ వాల్యూమ్ 80 శాతం పెరిగిందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. లావాదేవీల విలువ 101 శాతం పెరిగి 1,91,359.94 కోట్ల రూపాయల నుండి 3,86,106.74 కోట్లకు చేరుకుంది. కాగా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిని ఎక్కువగా ఇప్పుడు వాడుతున్న సంగతి తెలిసిందే.