మనమరాళ్ల కోసం మరోసారి చెఫ్‌గా మారిన మెగాస్టార్…!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి చెఫ్ గా మారారు. ఇదివరకే అమ్మ కోసం దోశలు వేసిన పెట్టిన చిరు.. ఇప్పుడు తన మనవరాళ్ల కోసం ఏకంగా కెఎఫ్‌సీ చికెన్ ఇంట్లోనే చేసి పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఈ చికెన్ కోసం ఏమేం కావాలి.. ఎలా సిద్ధం చేయాలి అంటూ 4 నిమిషాలకు పైగా వీడియో పోస్ట్ చేశాడు. నోరూరించే కెఎఫ్‌సీ చికెన్ చేసి తన ముద్దుల మనవరాళ్లకు తినిపించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది.

లాక్‌డౌన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి వంటింట్లోకి చేరి తనలోని నలభీముడిని ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నోరూరించే ఉప్మా పెసరెట్టు వేసిన ఆయన అనంతరం మరి కొన్ని వంటకాలను చేసి కుటుంబానికి రుచి చూపించారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం మలయాళ బ్లాక్‌ బస్టర్‌ లూసిఫర్‌ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాను వివి వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు.