అమరావతి: సీబీఐ, ఈడీ కేసులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారా?. అందుకే మోదీకి మద్దతు తెలుపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఒడిషా ఎంపీ. అసలు ఆయన ఎందుకలా అన్నాడు. అసలు విషయం ఏంటి?.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అటు మృతుల సంఖ్య కూడా అదే విధంగా ఉన్నాయి. ఇందుకు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ చేయలేకపోవడమే కారణమని అంటున్నారు. కరోనా కట్టడిపై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఫోన్ సంభాషణే ఇప్పుడు దేశంలో రాజకీయ రచ్చకు దారి తీసింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. కరోనా పరిస్థితులపై సీఎంల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు భయపడొద్దని భరోసా ఇచ్చారు.
అయితే వీరిలో ప్రధాని మోదీ మాటలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కేవలం ఆయన మనసులోని మాటలను మాత్రమే చెప్పారని, పనికొచ్చే విషయాలు చెబితే బాగుండేదని సోరోన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ‘‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. ఈ సమయంలో కలిసి కట్టుగా ఉండాలి. ఎన్నివిభేదాలు ఉన్నా కరోనాపై కలిసి కట్టుగా పోరాడాలి. ఓ సోదరుడిగా చెబుతున్నా’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఒడిషా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా కౌంటర్ ఇచ్చారు. తమను రాజశేఖర్ రెడ్డి కుమారుడివి సీబీఐ, ఈడీ కేసులకు భయపడి ప్రధాని మోదీతో లాలూచీ పడటం సరికాదని విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఉలాకా ట్వీట్‌పై ఏపీలో జగన్ అభిమానులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉలాకా ట్విట్టర్‌కు విమర్శలు మోతెక్కిచ్చారు.