Odisha: వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన మాఝీ ప్రభుత్వం

-

పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మారుతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే పురస్కారాలు పేర్లు మారిపోతాయి.ఒడిశాలో తాజాగా అదే జరిగింది. గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందజేసేది. అయితే ఆ అవార్డు పేరును మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం మార్చాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ శుక్రవారం రిలీజ్ చేసింది.

ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయంపై మాంఝీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు పేరు మార్చడం లేదని ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా రాష్ట్రానికి బిజు పట్నాయక్ అందించిన సేవలకు గుర్తుగా అవార్డు పేరు మార్చడం లేదని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివరణ ఇచ్చారు. అలాగే ఈ ఒడిశా నేలపైన, ఇక్కడ జన్మించిన వారిపైన తమ ప్రభుత్వానికి గౌరవముందని ఆయన అన్నారు.కాగా, ఆగస్ట్ 29వ తేదీ క్రీడా దినోత్సవం.ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరం ఆ రోజు.. రాష్ట్రంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పలు కేటగిరిల్లో ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news