కంచ గచ్చిబౌలి వ్యవహారం.. తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్

-

హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది.నేడు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి మండిపడ్డారు.చెట్ల పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సీఎస్‌ను కాపాడాలనుకుంటే.. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.దీనికి ప్రభుత్వ లాయర్ బదులిస్తూ..ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం పనులు జరగడం లేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో ఉంటుందని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. ఆ భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎంత టైం పడుతుంది?జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ.. 4 వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news