హైదారాబాద్ అనగానే అందరికీ గుర్తుచ్చేది బిర్యానీ అయితే ఉద్యోగస్తులకి గుర్తొచ్చేది మాత్రం ఐటీనే. ప్రపంచంలో పేరున్న పెద్ద కంపెనీలన్నీ హైదారాబాద్ లో మకాం వేయడమే దానికి కారణం. హైదారాబాద్ లో జాబ్ చేస్తున్నా అంటే అది సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అయ్యుంటుందని అనుకునే వారున్నారంటే హైదారాబాద్ కి సాఫ్ట్ వేర్ కి ఎంత అవినాభావ సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే ప్రస్తుతం హైదారాబాద్ లో ఆఫీసు స్పేసులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దేశంలోని అన్నీ నగరాలతో పోలిస్తే హైదారాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఆఫీసు స్పేసులు ఎక్కువగా అద్దెకు పోతున్నాయని తెలుస్తుంది.
ఐటీ విస్తరణ, అద్దెలు తక్కువగా ఉండడంతో పాటు భౌగోళికంగా హైదారాబాద్ కి ఉన్న అడ్వాంటేజీ కూడా దీనికి కారణం. దేశ వ్యాప్తంగా హైదారాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో 66శాతం కార్యాలయాల స్థలాలను ఆఫీసులకు లీజుకు ఇచ్చాయని అనార్ నివేదిక పేర్కొంది.