కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని గాజులపేట చౌరస్తా వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తబ్లీగీ జమాత్ ఇస్తే.. మా సారంగపూర్ ను కవిత సందర్శించి మాట్లాడారు. డిక్లరేషన్ హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 3వేల బడ్జెట్ పెట్టి 700 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో గంగా జమునా సంస్కృతిని కాపాడారని మైనార్టీలకు బీఆర్ఎస్ పదేళ్లలో అమలు చేసిన షాబీ ముబారక్ సహా విద్యార్థినిలకు ప్రోత్సాహక పథకాలు అమలు చేయలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉండటంతో ఆయన మైనార్టీల కోసం పని చేస్తారన్న నమ్మకం లేదన్నారు. షాదీ ముబారక్ కింద రూ.1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మైనార్టీలు అధికంగా ఉన్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వారి ప్రభుత్వం నుంచి ఈ జిల్లా మైనార్టీలకు అధిక నిధులు సాధించాలని డిమాండ్ చేశారు.