తెలంగాణాలో మావోయిస్ట్ ల కదలికలపై తెలంగాణా పోలీసులు ఫోకస్ పెట్టారు. మావోయిస్ట్ లు తెలంగాణలోకి మహారాష్ట్ర నుంచి భారీగా అడుగు పెట్టారు అనే సమాచారం నేపధ్యంలో నిన్న డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇందుకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. మావోలకు సంబంధించిన ప్రతీ సమాచారం సేకరించారు.
భారీగా రాష్ట్రంలోకి అడుగు పెట్టిన మావోలను త్రిముఖ వ్యూహంతో ఎదుర్కోవడానికి తెలంగాణా పోలీసులు సిద్దమయ్యారు. కేంద్ర హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు కే విజయ కుమార్ సూచనలతో అడుగులు వేస్తున్నారు. సాంకేతికతో పాటుగా భారీ బలగాలను వాడుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో మావోల కదలికల నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది.