Official: ఈనెల 12వ తేదీన ఆచార్య ట్రైలర్ రిలీజ్..

-

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పింది ఆచార్య టీం..గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే లుక్ లో కనిపిస్తాడు అని చిత్ర యూనిట్ అంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందిది.

 

కాగా ఆచార్య సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ డేట్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 12న ఆచార్య మూవీ నుంచి ట్రైలర్ విడుదల అవుతున్నట్టుగా ట్విట్టర్లో పేర్కొన్నారు చిత్రయూనిట్.

కాగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ మూవీ ని అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ తెరకెక్కించాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో లో రామ్ చరణ్ సైతం నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version