రాష్ట్రంలో నేటి నుంచి స్కూల్స్‌లో పాత వేళ‌లే

-

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పాఠ‌శాలల స‌మ‌యం 11 : 30 వ‌ర‌కు ఉండ‌గా.. దానిని పాత విధానంలోనే కొన‌సాగించ‌నున్నారు. గ‌త కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల ప‌ని వేళ‌ల‌ను రాష్ట్ర విద్యా శాఖ మార్చింది. అయితే ప్ర‌స్తుతం ఎండల తీవ్రత కొంత వ‌ర‌కు త‌గ్గింది. దీంతో పాఠ‌శాల‌ల‌ను పాత ప‌ని వేళ‌ల తోనే న‌డిపించాల‌ని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో నేటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 : 30 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్, ప్రయివేటు పాఠ‌శాల‌ల ప్రిన్స్‌ప‌ల్స్ కు విద్యా శాఖ పంపించింది. కాగ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం 12 : 30 గంట‌ల నుంచి 1 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించాల‌ని విద్యా శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను తెలిపింది. కాగ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఒంటి పూట బ‌డులు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version