‘నాటునాటు’కు గోల్డెన్‌ గ్లోబ్‌.. ఇదో చారిత్రక విజయం : చిరంజీవి

-

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి ఇతర చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ చిరు ట్వీట్ చేశారు.

 ‘‘ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటునాటు’కి గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. చరణ్‌, తారక్‌తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాట్స్‌’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version