ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. 2020 ఏడాది కి మొత్తం 119 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2021 ఏడాదికి పద్మ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇందులో ఏడుగురి కి పద్మవి భూషణ్, 10 మంది పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. విజేతలలో 29 మహిళలు.. ఓ ట్రాన్స్‌జెండర్ ఉండటం గమనార్హం. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి.. ఒలింపియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మభూషణ్‌ను వరించింది. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంది.