రిక్షాల్లో వారిని తీసుకెళ్లొద్దు.. తాలిబన్ల వార్నింగ్

-

ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కిచ్చుకున్న తర్వాత తాలిబన్లు వింతవింత నిర్ణయాలతో ప్రజల్ని హింసిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను విద్యా ఉద్యోగాలకు దూరం చేశారు. కేవలం వారిని వంటింటికే పరిమితం చేశారు. కాదని ఎవరైనా ధైర్యం చేస్తే కొరడా దెబ్బల వంటి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఐసిస్- కే ఉగ్రవాదులు దేశంలో వరసగా ఉగ్రదాడులు చేస్తున్నారు. ఇలా ప్రజల ఇష్టాన్ని గెలుచుకోలేపోతున్నారు.

తాజాగా తాలిబన్లు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. సాయుధ ధళాలను రిక్షాల్లో తీసుకెళ్లవద్దని రిక్షాపుల్లర్లకు హెచ్చరికలు జారీచేశారు. ఆయుధాలను రిక్షాల్లో తీసుకెళ్లవద్దని సూచించారు. ఆఫ్ఘన్ లోని నంగన్ హార్ ప్రావిన్స్ జలాలాబాద్ లో రిక్షా నడిపే వారికి ఇది మంచినిర్ణయం కానుంది. దీనిపై ఆప్రావిన్స్ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ఎవరైనా సాయుధ బలగాలను రిక్షాల్లో తీసుకెళ్లాలని కోరితే వెంటనే అధికారులకు తెలియజేయాని ఆదేశించారు.

తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా ప్రజాకర్షణను పెంపొందించుకునేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లపై విసిగి ఉన్న ప్రజల్ని మరలా తమ వైపు మరల్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news