మరోసారి వైసీపీలో రచ్చ, అధిష్టానం వద్దకు పంచాయితీ…!

-

చీరాలలో వైసీపీలో మరోసారి రచ్చ మొదలయింది. వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర్ దుమారం రేపాయి. నియోజకవర్గంలో వైసీపీని నాశనం చేస్తున్నారని, అలాగే ఎవరికి భయపడేది లేదు అంటూ కరణం వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వైసీపీ శ్రేణులు కూడా మండిపడ్డాయి. తాజాగా దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు వెళ్ళింది.

కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత పై ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… నిన్న వైఎస్ వర్థింతి కార్యక్రమంలో తనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇద్దరిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న ఆమంచి… నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం లేకుండా చేసారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news