ఆరోగ్యానికి ఈ బియ్యం ఎంతో మంచివి!

మన దేశంలో ప్రధాన ఆహార వనరులలో బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆహారాన్ని అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో కేవలం రుచి కోసమే అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కావున ఎక్కువ శాతం మంది తెల్ల బియ్యంను (పాలిష్ బియ్యం) వినియోగిస్తున్నారు.

చాలామందికి ముడి బియ్యం (దంపుడు బియ్యం) గురించి తెలియదు. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ దంపుడు బియ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఈ బియ్యాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను దూరం చేస్తాయి. వీటిలో అధిక శాతం కార్బోహైడ్రేట్లతో నిండి ఉంది.

పోషకాహారంగా ఈ బియ్యం చాలా ఆరోగ్యకరమైనవని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వీటిలో అదనపు పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

ఈ బియ్యం ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలను అందించే అధిక మొత్తంలో ఫైబర్లు మరియు ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి.

ఈ బియ్యం సెలీనియం యొక్క మంచి మూలం, ఇది థైరాయిడ్ హార్మోన్ ల ఉత్పత్తి, యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తిని, ఇంకా రోగనిరోధక పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

వీటిని తరచూ తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిలో నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

అన్నిరకాల బియ్యం శక్తి ముఖ్య వనరులే, కానీ ఈ దంపుడు బియ్యం ఎక్కువ పోషకాలను ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.