సాధారణంగా చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువగానే ఉంటుంది. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఆ జిల్లాలో ఉంది. అడవుల నుంచి వస్తున్న ఏనుగుల గుంపు సమీప గ్రామాల ప్రజలను భయపెడుతూ ఉంటుంది. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో గత 13 రోజులుగా 15 ఏనుగుల రాత్రి సమయాల్లో అడవుల నుంచి బయటకు వచ్చి గ్రామాలను ద్వంశం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
పంట పొలాలను నాశనం చేస్తున్నాయి ఏనుగులు. అయితే, ఈ ఏనుగుల మంద నుంచి విడిపోయిన ఒక ఏనుగు ఒక గ్రామానికి చుక్కలు చూపిస్తుంది. డీకే చెరువు గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈ ఏనుగు రాత్రి వేళ చొరబడి వీధులన్నీ సంచారం చేసింది. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇదే ఏనుగు,
దళవాయిపల్లె, రసూల్‌నగర్ గ్రామాల్లోకి ప్రవేశించి రాత్రి పగలు అనే తేడా లేకుండా గ్రామాల్లో తిరుగుతుంది. దీనితో కొందరు యువకులు ధైర్యం చేసి దాన్ని ఊరి బయటకు తరమడానికి ప్రయత్నం చేయగా తొండంతో కొట్టడంతో గోపీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, ఆ ఏనుగుని నానా కష్టాలు పడి ఏనుగుల మందలో చేర్చడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.