షిర్డీ సాయి బాబా ఆలయం” దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి పెద్ద ఎత్తున దర్శించుకునే పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. నిత్యం లక్షలాది మంది భక్తులు షిర్డీ సాయి నాధుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. పాదయాత్రలు చేసే వెళ్ళే వారు కూడా ఎందరో ఉన్నారు. ముఖ్యంగా సాయి బాబా భక్తులు అయితే ఏడాదికి రెండు సార్లు, మూడు సార్లు బాబాను దర్శించుకుంటూ ఉంటారు.
అయితే ఈ తరుణంలో భక్తులకు షాక్ ఇచ్చారు దేవాలయ నిర్వాహకులు. షిరిడి సాయి ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 19 అంటే ఆదివారం నుంచి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు శుక్రవారం సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం వెనుక కారణం కూడా ట్రస్ట్ పేర్కొంది.
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే మాట్లాడుతూ పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షిరిడి విశిష్టతను తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మేరకు శనివారం సాయంత్రం షిర్డీ గ్రామస్తులు అంతా సమావేశమై తమ కార్యాచరణ ప్రకటిస్తారని ప్రకటనలో తెలిపారు.