త్వరపడండి మిస్ అవ్వకండి – కిలో పదిహేను రూపాయలకే ఉల్లిపాయలు ??

-

దేశంలో గడిచిన కొద్ది నెలల నుండి అన్ని రాష్ట్రాలలో ఉల్లిపాయల కొరత పెరుగుతుంది. ఈ సమస్య వల్ల పార్లమెంటులో కూడా పెద్ద చర్చ కూడా జరిగింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అధికారంలో ఉన్న పార్టీ పై విపక్ష పార్టీలు దేశంలో ఉన్న ఉల్లిపాయలు కొరత గురించి అధికార పార్టీని నిలదీయడం జరిగింది. ఈ సమయంలో దాదాపు కిలో 150 రూపాయల నుండి 200 రూపాయలకు పైగానే ఉల్లిపాయ ధర పలకడం జరిగింది.

దీంతో చాలా మంది సామాన్యులు ఉల్లిపాయల కోసం రోడ్డున పడ్డారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇటీవల కొన్ని రోజుల నుండి ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి 40 రూపాయల నుండి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది. పూర్తి స్థాయిలో పంట ప్రజలకు అందుబాటులోకి వస్తే ఉల్లి ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

 

బహిరంగ మార్కెట్లలో ఉల్లి 50 రూపాయల నుండి 60 రూపాయలు పలుకుతోంది. జనవరి నెల చివరినాటికి ఉల్లి ధర పూర్తిగా తగ్గుతుందని కిలో ఉల్లి 20 రూపాయలు లేదా 15 రూపాయలకే ఉల్లిపాయ ధర పలికే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద అ ఈనెల చివరాకరికి సామాన్యులు కొన్నిటికి ఉల్లిపాయ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news