వామ్మో… ఈ ఘనుడు ఎవరో కానీ ఏకంగా సింహం నోటిలో చేయి పెట్టాడు..!

-

అడవికి రారాజు సింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. తన జోలికి వెళ్లనంతవరకు చాలా ప్రశాంతంగా ఉండే సింహం, ఎవరైనా తన దగ్గరికి వచ్చి తోక జాడిస్తే మాత్రం తన జూలును విదిలిస్తుంది. దూరం నుంచి సింహాలని చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాదు, సింహాలతో దగ్గరుండి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలంటే మాత్రం ప్రాణం మీదికి తెచ్చినట్లే అవుతుంది. మామూలుగా మనం ఎక్కడికైనా జూ లాంటి ప్రదేశాలకి వెళితే అక్కడ ఉండే బోర్డు లపై చూస్తూనే ఉంటాం. .

lion

తాజాగా ఓ వ్యక్తి జూ కి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న సింహం దగ్గరికి వెళ్లి చేయి చాచాడు. సింహం ఆ చేయిని లటుక్కున నోట్లో పెట్టేసుకుంది సింహం. అయితే ఆవ్యక్తి మాత్రం నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే చేయి సింహం నోట్లో పెట్టుకున్న కానీ అతడు సేఫ్ గా బయట పడ్డాడు. సింహం నోట్లో అతని చేయి ఉన్న సమయంలో అతను అరిచిన అరుపులు నిజంగా భయబ్రాంతులకు లకు గురి చేశాయి. అతను అంత పెద్దగా అరుస్తూ ఉన్నా కానీ ఆ సమయంలో అతని దగ్గరికి వెళ్లలేకపోయారు. అతని దగ్గరికి వెళ్లి కాపాడే ప్రయత్నం చేయకపోగా.. చేతిలో ఉండే సెల్ ఫోన్ లో ఆ వీడియో ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. జంతువులతో తమాషా చేస్తే చివరికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సుమా… కాబట్టి వాటితో కాస్త జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version