కరోనా పరీక్షల పరంగా మన దేశం కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది కోట్ల 11 లక్షల పరీక్షలు చేసారు. రోజు వారీ పరీక్షల్లో ఇండియా ముందు వరుసలో ఉంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 11 లక్షల కోవిడ్ నమూనాలను పరీక్షించారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరీక్షల మౌలిక సదుపాయాలను పెంచడమే దీనికి కారణం అయింది.
ఇండియా కరోనా పరీక్షల సామర్థ్యం రోజుకు 15 లక్షలను కూడా తాకింది. అందరికీ సులభంగా అందుబాటులో ఉండే కరోనా పరిక్షలు చేస్తున్నారు. ప్రాంప్ట్ ఐసోలేషన్ మరియు సమర్థవంతమైన చికిత్సకు పరిక్షలు కీలకమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది తక్కువ మరణాల రేటుకు దారితీస్తుందని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కేవలం ఒక టెస్టింగ్ ల్యాబ్ నుండి ప్రారంభించి, దేశంలో ఈ రోజు వెయ్యి 883 ల్యాబ్‌లు ఉన్నాయి.