ఫన్ బకెట్ భార్గవ్ కేసు..లైవ్ లోకి మరో అమ్మాయి !

-

ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో చాలా మంది యువతులు ఇబ్బంది పడుతున్నారు. భార్గవ్ తో గతంలో టిక్ టాక్ వీడియోలు చేసిన పలువురు యువతులు ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

గర్భం దాల్చిన అమ్మాయిలు వీరే అంటు పోస్టులు పెడుతున్న క్రమంలో ఒక్కొక్కరిగా అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తున్నారు అమ్మాయిలు. తామకు భార్గవ్ కు సంభందం లేదని, దయచేసి తమ ఫోటోలు లాంటివి వాడవద్దని వేడుకుంటున్నారు. ఇక ఈ కేసులో బాధితురాలు మైనర్ బాలిక కావడంతో ఆమె గురించి ఎలాంటి ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా మౌనిక అనే అమ్మాయి కూడా ఈ విషయం మీద స్పందించింది. రెండున్నరేళ్ల క్రితం తాను వీడియోలు చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు తనకు అసలు సంబంధం లేదని పేర్కొంది. తన ఫోటోలు వాడుతూ తానే బాధితురాలు అంటున్నారని, అవి మార్చాలి అని కోరింది. 

Read more RELATED
Recommended to you

Latest news