ఎస్‌బీఐ హెచ్చరిక: వెబ్‌సైట్ URLలో http అని ఉంటే.. మీ ఖాతా ఖాళీ..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులను హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు మెరుగుపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ.. ఖాతాదారుల అకౌంట్లో డబ్బులను స్వాహా చేస్తున్నారు. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన మిలియన్ల కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు, సూచనలు అందిస్తోంది. ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది.‘వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్, కేవైసీ, ఎస్ఎంఎస్, యాప్, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్స్‌లను ఎవరితో పంచుకోవద్దు. బ్యాంకులకు సంబంధించిన సేవలు, ఇతర సమాచారం పొందడానికి కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్, అధికారిక వెబ్‌సైట్‌లో విషయాలు తెలుసుకోవాలి.’’ అని ఎస్‌బీఐ వెల్లడించింది.

State-bank-of-India
State-bank-of-India

ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా..

ఆన్‌లైన్ ద్వారా మోసగాళ్లు వ్యక్తిగత గుర్తింపు డేటాను, ఆర్థిక ఖాతాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా, సాంకేతికత ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్‌నెట్, ఇ-మెయిల్ ద్వారా ఏదైనా వెబ్‌సైట్ లింక్ పంపి.. యూజర్ అందులో లాగిన్ అయితే చాలు.. బ్యాంకుకు సంబంధించిన వివరాలు హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.

ఇ-మెయిల్ ద్వారా వినియోగదారుడికి లింక్ అందించి.. అందులో హైపర్ లింక్‌ను క్లిక్ చేయమని అడుగుతాడు. ఈ హైపర్ లింక్.. నిజమైన వెబ్‌సైట్ లింక్‌లా కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు ఒరిజినల్ వెబ్‌సైట్ అని తెరిచే ప్రమాదం ఉంది. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత తదుపరి ప్రక్రియ పూర్తి చేయడానికి డబ్బులు తీసుకోవడం, ఓటీపీ గురించి, బ్యాంకు వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలా బ్యాంకు లాగిన్, పాస్‌వర్డ్ వంటి సమాచారాన్ని ఈజీగా తెలుసుకుంటారు. మీ పూర్తి వివరాలు వెల్లడించి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే.. మీ పూర్తి డేటా మోసగాడి చేతిలోకి వెళ్లిపోతుంది.

ఖాతా సురక్షితంగా ఉండాలంటే..

ఖాతాదారుడు ఎప్పుడు అధికారిక వెబ్‌సై‌కు లాగిన్ అయ్యేటప్పుడు URL టైప్ చేసి వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో ఓపెన్ అయిన పేజీలోనే మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేయవచ్చు. అయితే URL అనేది httpsతో మొదలవుతుంది. ఇందులో ‘S’ అంటే ఆ వెబ్‌సైట్ పేజీ సురక్షితమని అర్థం. ఒకవేళ URL అనేది httpగా ఉంటే అది మోసపూరితమైనదిగా గుర్తించాలి. ఇలాంటి యుఆర్ఎల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మీ వివరాలు వెల్లడిస్తే.. బ్యాంకింగ్ సంబంధించిన వివరాలు ఈజీగా తెలుస్తుంది. దీంతో మీ బ్యాంకులో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయి. బ్యాంకులు ఇ-మెయిల్ ద్వారా మీ అకౌంట్‌ను ధ్రువీకరించమని ఎప్పుడు అడగదని తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు తెలుసుకుని ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని ఎస్‌బీఐ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news