బ్రేకింగ్ : హైదరాబాద్ లో పరువు హత్య.. ప్రణయ్ తరహాలోనే !

హైదరాబాద్ నగరంలో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి కిరాతంగా హత్య చేయించాడు. వివరాల్లోకి వెళ్తే చందానగర్ నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్ట పడని యువతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డి లో హత్య చేయించాడు.

ఈ యువ జంట పెళ్లి అయ్యాక యువతి తండ్రికి భయపడి చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యహ్నం ప్రేమ జంట ను గచ్చిబౌలి కిడ్నాప్ చేయగా యువతి కారు లో నుంచి పారిపోయిన 100కి సమాచారం ఇచ్చింది. గచ్చిబౌలిలో కిడ్నాప్ కేసు నమోదు కాగా, సంగారెడ్డి తీసుకు వెళ్లి హత్య చేయడంతో అక్కడ హత్య కేసు నమోదు అయిన్నాయి. అయితే ఈ హత్య ఎలా జరిగింది అనే విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.