ఫలక్ నుమాలో ఫ్యామిలీ అదృశ్యం అయిన కేసులో నలుగురు మృతి చెందారు. వరద నీటిలో ఒకే ఫ్యామిలీలో చెందిన ఐదుగురు కొట్టుకు పోయారు. అయితే ఐదు కిలోమీటర్ల పరిధిలో నలుగురు మృత దేహాలు దొరికాయి. ఆ కుటుంబంలో తహేర్ అనే వ్యక్తి మాత్రం మూడు కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఫలక్ నుమా సమీపంలో నలుగురు మృతదేహాలు దొరికాయి. మైలార్ దేవ్ పల్లి నుంచి నీటిలో కొట్టుకొని ఫలక్నామ వరకు వచ్చానని తహెర్ పేర్కొన్నాడు.
ఒక చెట్టును పట్టుకొని ఆగిపోయానని అతను పేర్కొన్నాడు. నీటిలో కొట్టుకుపోతున్న కుటుంబ సభ్యులను కాపాడే ప్రయత్నం చేశానని కానీ ఇంటి పక్కన ఉన్న గోడ కూలి పోవడంతో ఒక్కసారిగా వరదనీటి లోపలికి వచ్చిందని తాహెర్ పేర్కొన్నాడు. ఉన్నపళంగా లోపలికి నీరు రావడంతో ఐదుగురం నీటిలో కొట్టుకు పోయామని ఆయన పేర్కొన్నాడు. నా కుటుంబం మొత్తం వరదల్లో చనిపోయి నేను ఒక్కని మాత్రమే మిగిలి పోయానని ఆయన పేర్కొన్నాడు.