ప్రస్తుతం నడుస్తున్నది ఆధునిక యుగం. స్మార్ట్‌ఫోన్లతో అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం. కెమెరాలు, కెమెరామెన్లతో పనిలేకుండా స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి భారీ మెగాపిక్సల్స్ కలిగిన కెమెరాలు ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను కొంటున్నాం. అయితే అంత వరకు బాగానే ఉంది. ఆ ఫోన్లతో నిత్యం ఏవేవో సెల్ఫీలు తీసుకుంటున్నాం. కానీ ఆ సెల్ఫీల్లో నాన్న ఉన్నారా..? అవును నాన్నే.. ఏంటి షాకయ్యారా..? అవును.. ఇలాంటి విషయాలు మాట్లాడితే ఎవరికైనా సరే షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.
ఫోన్లోనూ అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అని పిలవడమే. అవసరమొచ్చినప్పుడు తప్ప, ఎప్పుడూ గుర్తురానందుకు
నాన్నెప్పుడైనా బాధపడ్డాడా? ఏమో.. ఇద్దరూ సమానమే అయినా, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనుకబడ్డాడు.
మీ ఫోన్లతో మీరు ఇప్పటి వరకు ఎన్నో ఫొటోలు తీసుకుని ఉండవచ్చు. కానీ ఒక్క ఫొటో, ఒక్క సెల్ఫీ అయినా నాన్నతో ఉందా..? లేదు కదా. దాదాపుగా అందరి పరిస్థితి ఇంతే. మనకు జన్మనిచ్చిన తండ్రిని మరిచిపోతాం. మనం ఎదగడానికి తాను కొవ్వొత్తిలా కరిగిపోయిన విషయాలను మనం గుర్తుంచుకోం. మనం మన లక్ష్యాలను చేరుకుంటానికి ఆయన చేసిన త్యాగాలను అస్సలు పట్టించుకోం. మనకు మన పెళ్లాం, పిల్లలు, ఆస్తి, విలాసాలు.. ఇవే కదా.. కావల్సింది. మన ఎదుగుదలకు ఎంతో శ్రమించిన నాన్నతో కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకున్నామా..? లేదు..
మన భార్యా పిల్లలు, ఆస్తి జీవితాంతం ఉంటాయి. కానీ నాన్న.. ఇంకెన్నాళ్లు ఉంటాడు.. ఉండడు కదా.. కనుకనే ఇప్పటికైనా ఆయనతో ఒక్కసారి ఒక్క సెల్ఫీ తీసుకుందాం. ఆయనను గుర్తు చేసుకునేందుకు మాత్రమే కాదు, ఆయనను ప్రేమించడానికి.. ఆయన పోయాక కాదు, ఆయన ఉన్నప్పుడే.. ఆయన ఉన్నన్ని రోజులు.. ఆయనను ప్రేమిస్తున్నామని.. మనం సెల్ఫీతో ఆయనకు చెబుదాం. ఎంత వీలైతే అంత నాన్నను ప్రేమిద్దాం. ఇప్పుడే.. ఈ క్షణం నుంచే ఆ పని చేద్దాం..
ఫాదర్స్ డే సందర్భంగా మనలోకం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న నాన్నతో ఒక సెల్ఫీలో (#slefiewithDad , #నాన్నతోఒకసెల్ఫీ ) మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. నాన్నతో ఒక సెల్ఫీ తీసుకుని [email protected]కి మెయిల్ చెయ్యండి.. #selfiewithdad హ్యాష్ టాగ్‌తో షేర్ చెయ్యండి. మనలోకంలో పబ్లిష్ చేస్తాం. హ్యాప్పీ ఫాదర్స్ డే..!