ఇవాళ ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున బరిలో దిగిన వర్ల రామయ్యకు మాత్రం నిరాశ తప్పలేదు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఇవాళ వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టి 6 గంటలకు ఫలితాలు వెల్లడించారు.
వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Congratulations & best wishes to party colleagues Venkataramana Garu, Pilli Bose Garu, @AARamireddy Garu & @mpparimal ji on getting elected to the Rajya Sabha. I look forward to working with you to voice the aspirations of the people of Andhra Pradesh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, 2020