ఏడాది బాలుడు, లాటరీలో 7 కోట్లు కొట్టేసాడు…!

-

కేరళకు చెందిన ఏడాది బాలుడు లాటరీలో 7 కోట్లు గెలిచాడు. యుఎఇలో నెలవారీ రాఫిల్ డ్రాలో 1 మిలియన్ డాలర్ల (రూ. 7 కోట్లకు పైగా) జాక్‌పాట్ గెలుచుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మొహమ్మద్ సలా తండ్రి రమీస్ రెహ్మాన్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లలో భాగంగా ఏడాది పాటు పాల్గొంటున్నాడు. ఈ నేపధ్యంలోనే అతను తన కొడుకు పేరిట లాటరీ కొనుగోలు చేసాడు.

లాటరీ సిరీస్ లో 323 లో టికెట్ నంబర్ 1319 ను తన కొడుకు పేరుతో కొనుగోలు చేసినట్లు గల్ఫ్ న్యూస్ పేర్కొంది. రెహమాన్ టికెట్ లక్కీ డ్రా ను మంగళవారం ప్రకటించారు. దీనిపై అతను స్పందించాడు. “ఈ వార్తతో నేను చాలా ఆనందంగా ఉన్నాను మరియు ఈ అద్భుతమైన ప్రమోషన్ కోసం నేను దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కొడుకు భవిష్యత్తు ఇప్పుడు బాగా భద్రంగా ఉందని చెప్పాడు.

31 ఏళ్ల రమీస్ అబుదాబిలోని ఒక ప్రైవేట్ కంపెనీకి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు మొహమ్మద్ సలాహ్ ఫిబ్రవరి 13 న తొలి పుట్టిన రోజు జరుపుకుంటాడని అక్కడి మీడియా వెల్లడించింది. యుఎఇలో ఇటువంటి లక్కీ డ్రాల్లో చాలా మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. గత సంవత్సరం, దుబాయ్ లో ఉద్యోగం దొరకక స్వదేశానికి తిరిగి వచ్చిన ఒక భారతీయ రైతు, ర్యాఫిల్ డ్రాలో 4 మిలియన్ డాలర్లకు పైగా గెలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news