వ‌చ్చేస్తున్నాయ్‌.. వ‌న్‌ప్ల‌స్ 8 సిరీస్‌ ఫోన్లు.. లాంచ్ ఈవెంట్ ఆన్‌లైన్‌లోనే..!

-

ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్.. త‌న వ‌న్‌ప్ల‌స్ 8 సిరీస్ ఫోన్ల‌ను ఏప్రిల్ 14వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు వ‌న్‌ప్ల‌స్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇక ప్ర‌తి ఏడాది వ‌న్‌ప్ల‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఒకేసారి ఈవెంట్ల‌ను నిర్వ‌హిస్తూ.. వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌ను లాంచ్ చేస్తూ వ‌స్తోంది.. అయితే క‌రోనా కార‌ణంగా.. ఈ సారి మాత్రం వ‌న్‌ప్ల‌స్.. కేవ‌లం ఆన్‌లైన్‌లోనే ఈ లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నుంది.

oneplus launching one plus 8 phones on april 14th event only on online

కాగా వ‌న్‌ప్ల‌స్.. త‌న 8 సిరీస్‌ ఫోన్ల‌లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ క‌లిగిన డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేసింద‌ని తెలిసింది. ఇక వాటిలో 5జీకి స‌పోర్ట్‌ను అందివ్వ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే ప‌లు ఇత‌ర ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్ల‌లో అందివ్వ‌నున్నార‌ని తెలిసింది.

వ‌న్‌ప్ల‌స్ 8 ఫోన్‌లో.. 6.55 ఇంచుల డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 3డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, 8/12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, 48, 16, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.. తదిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది.

అలాగే వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ ఫోన్‌లో.. 6.78 ఇంచుల డిస్‌ప్లే, 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, 8/12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, 48, 48, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డస్ట్ రెసిస్టెన్స్‌, యూఎస్బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, 4510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.

కాగా ఏప్రిల్ 14వ తేదీన భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8.30 గంట‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ త‌న లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నుంది. దీన్ని వ‌న్‌ప్ల‌స్ అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌తోపాటు యూట్యూబ్‌లోనూ లైవ్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news