న్యూ ఇయర్ సందర్బంగా ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డ్యాన్సింగ్ టాలెంట్‌తో అదరగొట్టేశారు. న్యూ ఇయర్ కావడంతో ఒంగోలులో ఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. మాగుంట అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎంపీ కూడా వేదికపైకి రాగా.. ఎంపీని కూడా డ్యాన్స్ చేయాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేశారు.
దీంతో శ్రీనివాసులురెడ్డి అభిమానులు, స్థానిక కార్యకర్తలతో కలిసి కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు. అందరూ కలిసి సరదాగా హీరో మహేష్‌బాబు పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు కుర్రాళ్లకు పోటీ ఇస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా అన్న రేంజ్‌లో డ్యాన్స్ ఇరగదీశారు. మరి ఆ వీడియో మీరూ చూసేయండి..!