తెలంగాణాలో క‌న్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. కిలో ధ‌ర ఎంతో తెలుసా..?

-

దేశమంతటా ఉల్లిగడ్డ కోయకుండానా కన్నీరు కారేలా చేస్తుంది. దేశమంతా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లి ధర 100 ను చేరుకుంది. అయితే తెలంగాణలో ఉల్లి ధరలు మరింతగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర ఏకంగా రూ. 170 వరకూ వెళ్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ధర లేదు. హోల్ సేల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి ధర రూ. 145కు పెరిగింది. హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ చరిత్రలో క్వింటాలు ఉల్లికి రూ. 14,500 పలకడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.

ఇక రెండో రకం ఉల్లి రూ. 12,000, మూడో రకం ఉల్లి రూ. 8 వేలు, నాసిరకం ఉల్లి రూ. 7,000 వరకూ ధర పలుకుతోంది. రెండు కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో పాటు, డిమాండ్ కు తగ్గ సరఫరా లేనందునే ధరలు ఇంతగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news