బ్యాంకు ఉద్యోగి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్..!

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ రమ్మీ కి బానిసలుగా మారిపోతున్న వారు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నారూ . ఇక్కడ ఏకంగా ఆన్లైన్ రమ్మి గేమ్ ఒక బ్యాంకు ఉద్యోగి ప్రాణం తీసింది. ఆన్లైన్ రమ్మీ ఆట కు బానిస గా మారి పోయి బ్యాంక్ ఉద్యోగి అప్పులు చేసి ఆర్థికంగా ఎంతగానో చితికి పోయాడు. చివరికి మద్యానికి బానిసై మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది..

a person in nagpur passes away after drinking sanitizer

కోయంబత్తూరులోని చీర నాయకర్ పాలయం కు చెందిన మదన్ కుమార్ అనే 28 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి.. ఇటీవలే మొబైల్ లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడాడు క్రమక్రమంగా ఆడుతూ ఆడుతూ బానిసగా మారిపోయాడు. ఇక ఈ రమ్మీ గేమ్ లో లక్షల డబ్బులు పొట్టి అని పోగొట్టుకున్నాడు చివరికి అప్పులు కూడా చేశాడు ఇక అప్పులు తీర్చలేక మద్యానికి బానిసగా మారిపోయాడు. రోజురోజుకు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయాడు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.