త్రివిక్రమ్‌ రామ్ తో ఫిక్సయ్యాడా…!

త్రివిక్రమ్‌ మెగాఫోన్‌ పట్టి ఏడాది అవుతోంది. ఎన్టీఆర్‌తో సినిమా ఎనౌన్స్‌ చేసినా… ఇప్పట్లో మొదలయ్యేట్టు కనిపించడం లేదు. రాజమౌళి సినిమా పూర్తయితేగానీ… త్రివిక్రమ్‌కు డేట్స్ ఇవ్వనంటున్నాడు తారక్. ఎన్టీఆర్‌ను నమ్ముకుంటే కుదిరే పనికాదంటూ.. త్రివిక్రమ్‌ ఓ యంగ్‌ హీరోను లైన్లో పెట్టే పనిలో వున్నాడట.

అల వైకుంఠపురంలో రిలీజ్‌ తర్వాత త్రివిక్రమ్‌ ఎవర్ని డైరెక్ట్ చేస్తాడన్న ఆసక్తి నెలకుంది. తమ హీరోతో చేస్తే బాగుటుందని ఫ్యాన్స్‌ ఇంట్రెస్ట్ చూపించగా.. ఆ అవకాశం ఎన్టీఆర్‌ అభిమానులకు దక్కింది. టైటిల్‌ ఇంకా ఎనౌన్స్‌ చేయకపోయినా.. ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ రిజిష్టర్‌ చేయించారు. ఇంతలో కరోనా రావడం… ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌ ఆగిపోవడంతో… త్రివిక్రమ్‌ సినిమా మొదలు కాలేదు. ఇప్పట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌ పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. స్టార్స్‌ అందరూ బిజీగా వుండడంతో… యంగ్‌ హీరో రామ్‌తో సినిమా చేస్తాడన్నది ఫిలింనగర్‌ న్యూస్‌.

రామ్‌ పెదనాన్న స్రవంతి రవికిషోర్‌, త్రివిక్రమ్‌ మధ్య మంచి అనుబంధం వుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌తో కలిసి రవికిషోర్‌ నిర్మించిన ‘నువ్వే కావాలి’ మూవీకి త్రివిక్రమ్‌ మాటలు రాశారు. ఆతర్వాత సురేష్‌ మూవీస్‌తో కలిసి స్రవంతి మూవీస్‌ తీసిన ‘నువ్వునాకునచ్చావ్‌’కు త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించారు. ప్రస్తుతం హాసిని హారిక క్రియేషన్స్‌తో వరుస సినిమాలు తీస్తున్న త్రివిక్రమ్‌.. స్రవంతి రవికిషోర్‌తో కలిసి ఓ మూవీ చేస్తారని సమాచారం. స్రవంతి మూవీస్‌ బేనర్‌లో సినిమా అంటే రామే హీరో. రామ్‌ నటించిన రెడ్‌ రిలీజ్‌కు రెడీగా వుంది. మరో సినిమా కమిట్‌ కాలేదు. ఈలెక్కన త్రివిక్రమ్‌ డైరెక్షన్‌ చేసే బంపర్‌ ఆఫర్‌ రామ్‌కు దక్కుతుందో లేదో చూడాలి.