ఏపీలో ఆసక్తికర పరిణామం.. డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఇటీవలే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల వేళ.. మద్యం ఏరులై పారడం సహజమే. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ నంద్యాల జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ శ్రీనివాసులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులకు షాక్ ఇచ్చారు. మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులకు వెల్లడించారు.

దీంతో మద్యం షాపుల వద్ద ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తేనే అమ్మకాలను బోర్డులు వెలిశాయి. ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ చేయలేని మందు బాబు దుకాణానికి వచ్చి బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. మందు బాబులు ఆన్ లైన్ పేమెంట్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజు వారి కూలీలు చేసుకునే కొందరితో మొబైల్స్ ఉండవని.. ఆన్ లైన్ పేమెంట్ ఎలా చేయాలని వాపోతున్నారు. దీంతో ఉదయం నుంచి మద్యం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కొందరూ మందుబాబులు మద్యం షాపుల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news