ఆలోచించి ఓటెస్తేనే భవిష్యత్ మంచి బాటలు : సీఎం కేసీఆర్

-

మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని స‌బితా ఇంద్రారెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. దీని క‌న్న డేజంర్ ఇంకోటి మాట్లాడుతున్నారు. ధ‌ర‌ణి తీసి బంగాళాఖాతంలో ప‌డేస్త‌ర‌ట‌. అది భూమ‌తానా..? భూమేత‌నా..? రైతుల భూములు అన్యాక్రాంతం కావొద్ద‌ని, ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హారం చేశాం. నిమిషాల్లోనే రిజిస్ట్రేష‌న్‌, నిమిషాల్లోనే మ్యుటేష‌న్ అయిపోతుంది. ఆన్‌ది స్పాట్ ప‌ట్టా చేతికి వ‌స్తుంది.

ఇక ధ‌ర‌ణి ద్వారా రైతుబంధు నేరుగా మీ ఖాతాలోకి వ‌స్తుంది. మ‌రి ధ‌ర‌ణి బంద్ చేస్తే రైతుబంధు ఎలా వ‌స్త‌ది. ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నారు. మ‌ళ్లీ పైర‌వీకారుల‌ను తీసుకొచ్చే ప‌నిలో ఉన్నారు. ఇవాళ లంచం ఇవ్వ‌కుండా, ఎలాంటి ద‌ర‌ఖాస్తు పెట్ట‌కుండా నేరుగా మీ వ్య‌వ‌సాయానికి పెట్టుబ‌డి వ‌స్తుంది. ఆలోచించి నిర్ణ‌యం చేయాలి. అప్పుడే మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటది. ఆలోచించి ఓటు వేయ‌క‌పోతే ప‌దేండ్ల నుంచి క‌ష్ట‌ప‌డ్డ‌దంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరులా త‌యారువుతుంది. ఆలోచించే ఓటేస్తే భ‌విష్య‌త్‌కు మంచి బాట‌లు ప‌డుతాయి. లేదంటే ఇబ్బందులు ఏర్ప‌డుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news