ఆపరేషన్ సిందూర్ వలన కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. యుద్ధం పరిస్థితుల కారణంగా భద్రతా వ్యవస్థలను హై అలర్ట్ జారీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ఉపేక్షించరాదని.. అత్యవసర సేవలకు సెలవులు రద్దు చేయాలని, మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని కోరింది.
ఈ క్రమంలోనే ఏపీలోని గోదావరి జిల్లాలలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక డ్రోన్స్ ఉపయోగించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ప్రకటించారు. ఎందుకంటే యుద్దం నేపథ్యంలో స్లిపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయని నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.