ప్రైమ్ కు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ హక్కులు…?

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.04 గంటలు ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.26 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ నాన్ థియేట్రికల్ రైట్కు రూ.14 కోట్లు, మ్యూజిక్ హక్కులకు రూ.2.6 కోట్లు దక్కాయట. ఇక తెలుగు శాటిలైట్ డీల్ను రూ.6.5 కోట్లకు క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.ఇక ఈ చిత్రంలో మిర్‌ సర్వార్‌, నవదీప్‌ ముఖ్య పాత్రలు పోషించారు .ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news