ఏపీలో గంజాయికి చెక్ పెట్టేందుకు “ఆపరేషన్ పరివర్తన్” ప్రయోగం !

-

ఏపీ గంజాయి పై ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ కీలక ప్రకటన చేశారు. ఏపీ లో గంజాయి సాగు.. సరఫరాను అరికట్టేలా ఆపరేషన్ పరివర్తన్ చేపట్టామనీ ప్రకటించారు. ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామనీ.. ఈ ఆపరేషన్లో 80 టీములు పాల్గొన్నాయన్నారు. గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరుజనులు ప్రతిఘటిస్తోన్న సంఘటనలు తక్కువేనని.. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజనులే స్వచ్ఛంధంగా వస్తున్నారని వెల్లడించారు.

150 ఎకరాల్లో గంజాయి పంటని గిరిజనులే స్వయంగా ధ్వంసం చేశారని.. ఏవోబీలోనే ఈ సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. ఏపీ-ఒడిస్సాల్లో కలిపి మొత్తంగా ఎమిమిది జిల్లాల్లో గంజాయి సమస్య ఉందని తెలిపారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామని.. అలాగే ఇతర ఎన్ఫోర్స్మెెంట్ విభాగాలతోనూ కో-ఆర్డినేట్ చేసుకుంటున్నామనీ వెల్లడించారు.

గంజాయి సాగు, సరఫరా వెనుక గిరిజనులను అడ్డం పెట్టుకుని ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా.. అనే కోణంలోనూ విచారణ చేపడతామనీ.. గంజాయి సాగు సమస్యను శాంతి భద్రతల అంశంగా కాకుండా ఆర్ధిక-సామాజిక సమస్యగానే చూస్తున్నాని చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news