తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ భావన్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ సమావేశం అనంతరం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మెడియాతో మాట్లాడారు. ఈ నెల 14 నుండి జన జాగరణ పాద యాత్రలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే సభ్యత్వ నమోదు పై శిక్షణ ఉంటుందన్నారు.
ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఉంటాయని.. డిజిటల్ సభ్యత్వ నమోదుపై డీసీసీ లకు.., నియోజవర్గం నుండి ఒకరికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు కొంపల్లి లో శిక్షణా తరగతులు నిర్వహింసత్యమని ప్రకటన చేశారు.
అలాగే నిరుద్యోగం, దళిత బందు లాంటి పథకాల పై చర్చ ఉంటుందని.. డీసీసీ లతో పాటు…. మండల అధ్యక్షుల ను కూడా సమావేశానికి పిలుస్తున్నామన్నారు. పార్టీ నీ బూతు లెవల్ కి తీసుకెళ్లే ఆలోచన ఉందని చెప్పారు. ఇరిగేషన్, వ్యవసాయం రంగం పై అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. కోమటి రెడ్డి వ్యవహారం పార్టీ సీనియర్ నాయకుడు vh కి అప్పగించామని వెల్లడించారు. వచ్చే pac సమావేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ చేస్తామనీ స్పష్టం చేశారు మహేష్ గౌడ్.