ఒప్పో నుంచి ఎ53 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో కొత్త‌గా ఎ53 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. స్నాప్ డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ఉంది. వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ను అందిస్తున్నారు.

oppo a53 smart phone launched in india

ఒప్పో ఎ53 స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్
* 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఒప్పో ఎ53 స్మార్ట్ ఫోన్ ఎల‌క్ట్రిక్ బ్లాక్‌, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,990 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,490గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో విక్రయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news