రాజ్ నాథ్ రష్యా టూర్..! మోడీ గుట్టు రట్టు చేసిన ప్రతిపక్షాలు..!

-

opposition slams Rajnath singh russia tour
opposition slams Rajnath singh russia tour

గాల్వాన్ ఘర్షణ తరువాత భారత చైనా లకు మధ్య సంబంధాలు సరిగా లేవనే విషయం అందరికీ తెలిసిందే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు నిప్పు రావ్వెస్తే భగ్గుమనేలా మారాయి. పైగా గాల్వాన్ దాడిలో అమరులైన సైనికుల ఏ ఒక్కరి ప్రాణాలు కూడా వృదా అవ్వవని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే రష్యా చైనా భారత్ ల మధ్య జరగవలసిన సమ్మిట్ కరోనా పరిస్థితుల మూలానా జరగక ఈ నెల 23 కు పోస్ట్ పోన్ అయ్యింది. చైనా పై గుర్రు మీదున్న మోడీ ఈ సమ్మిట్ కు వెళ్ళడు అని.. ఆ సమ్మిట్ కు గల ఎలాంటి ప్రణాలిక షెడ్యూల్ సిద్ధం చేయలేదని వార్తలు వచ్చాయి.

కాగా, నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యాకు బయలుదేరారు. రష్యాలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నాడని భారత్‌-రష్యాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ 75వ విజయోత్సవ దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. ఇక ఆయన రష్యాకు వెళ్లడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈవిషయమై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైకి చైనాతో పడటం లేదని సైనికులను చంపిన వారితో సంబంధాలు ఇష్టం లేదని చెప్పి ఇలా రాజ్ నాథ్ సింగ్ ను పంపడామెంతి అని వారు ప్రశ్నిస్తున్నారు..రాజ్ నాథ సింగ్ ముఖ్యంగా అక్కడికి వెళ్లడానికి గల ఉద్దేశమే చైనాతో చర్చలు జరపాలని కానీ వేరే కట్టు కథలు చెబుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫయర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news