మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాని అనుసరించండి. వ్యవసాయానికి ఎరువులు అవసరం. అందుకోసం మీరు సేంద్రియ పదార్థాల తో తయారు చేసిన ఎరువులను ఉపయోగిస్తే మంచిది. దీని వలన రైతులకూ మేలు జరుగుతుంది. పైగా ఆ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇది ఇలా ఉంటే ఆర్గానిక్ (సేంద్రియ) పదార్థాలతో పురుగుమందులు చేసే కంపెనీలు చాలా తక్కువ కాబట్టి మీ పురుగుమందులు కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మీరు సరిగ్గా వ్యాపారం చేస్తే భారీ లాభాలు పొందగలరు. అయితే ఈ బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలంటే కొన్ని చట్టపరమైన అనుమతులు కావాల్సి ఉంటుంది.
ఒక్కరే స్టార్ట్ చెయ్యాలంటే ప్రొప్రైటర్‌షిప్ కింద నమోదు చేయించుకోవాలి. భాగస్వామ్యం కింద స్టార్ట్ చెయ్యాలని అనుకుంటే మీరు లిమిటెడ్ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్ (LLP) లేదా Ltd. కంపెనీ కింద కంపెనీస్ రిజిస్ట్రార్ (ROR) దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అలానే స్థానిక అధికారుల నుంచి మీరు ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. మీరు GST రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. MSME/SSI రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ పథకాల్లో సబ్సడీలు పొందగలరు. అదే విధంగా కంపెనీకి ఓ బ్రాండ్ పెట్టుకొని దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి.
20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే… వారికి EPF, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి. విదేశాలకు ఎగుమతి చేయదలిస్తే మీకు IEC కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రారంభం లో నెలకు 50 టన్నుల వర్మీకంపోస్టింగ్ ఉత్పత్తి చేసి అమ్మినా… అన్ని ఖర్చులూ పోగా రూ.40,000 లాభం ఉంటుంది. క్రమంగా మీరు అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి.