Oscars: అకాడమీ సభ్యత్వానికి రాజీమామా చేసిన విల్ స్మిత్….

-

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భార్యపై జోక్ చేసినందుకు ఆగ్రహం తట్టుకోలేక విల్ స్మిత్, వేదికపై ఉన్న క్రిస్ రాక్ దగ్గరకు వెళ్లి చెప్ప చెల్లుమనిపించారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. విల్ స్మిక్ భార్యకు ఉన్న జట్టుకు సంబంధించిన జబ్బు గురించి క్రిస్ రాక్ తనదైశ శైలిలో జోక్ పేల్చాడు. అయితే ఇది విల్ స్మిత్ కు ఆగ్రహం తెచ్చింది. క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడమే కాకుండా.. క్రిస్ రాక్ ను దుర్భాషలాడాడు. 

అయితే ఈ ఘటనపై విల్ స్మిత్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కొంతమంది స్మిత్ చర్యను తప్పుబడుతుండగా… మరికొంత మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. కాగా… ఈ ఘటనపై విల్ స్మిత్ ఇప్పటికే క్షమాపణ చెప్పారు. తాజాగా ఆస్కార్ ‘అకాడమీ’ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 94వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో జరిగిన ఘటన ఎంతో బాధకరమని, షాక్ కు గురిచేసిందని… తను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విల్ స్మిత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version