‘‘ నా ప్రాణాలకు ముప్పు ఉంది’’: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

-

పాకిస్తాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకం అయ్యాయి. దీంతో ఈ ఆదివారం జరిగే జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే నన్ను గద్దె దించేందుకు ఓ విదేశం హస్తం ఉందని ఇటీవల పాక్ ప్రజలను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ | imran khan

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. ‘‘ నా ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సీనియర్ నేత ఫైసల్ వావ్డా కూడా ఈ రకమైన వ్యాఖ్యలే చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణ హాని పొంచి ఉందని… హత్య  చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బహిరంగ సమావేశాల్లో పాల్గొనే సమయంలో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వాడాలని సూచించినట్లు వెల్లడించారు. పాక్ చరిత్రలో గతంలో ప్రధానులు హత్యకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version