మావోయిస్ట్ లకు ల్యాండ్ మైన్లు సప్లయ్ చేస్తున్న ఉస్మానియా ప్రొఫెసర్…!

-

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ని అరెస్ట్ చేసిన తెలంగాణా పోలీసులు సంచలన విషయాలను తమ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. జనవరి 18న కాసిని అరెస్ట్ చేసిన పోలీసులు, మావోయిస్టు అగ్రనేత లతో సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకున్నట్టు ఖాసీం రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్ కటకం సుదర్శన్ సహా ప్రసాదరావు హరి భూషణ్ తో టచ్ లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

అతనికి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించిన పోలీసులు, నడుస్తున్న తెలంగాణ అనే సంచికను ఖాసీం అతని భార్య స్నేహ లతా నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. సంచిక నడిపేందుకు మావోయిస్టు పార్టీ నుంచి నెలవారీగా నిధులు మావోయిస్ట్ ల నుంచి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగా,

పలు అనుబంధ సంస్థలు తెలంగాణ విద్యార్థి వేదిక, విద్యార్థి సంఘం, చైతన్య మహిళా వంటివి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 19 అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ అనుబంధ సంస్థలకు కాశీం సమన్వయకర్తగా ఉన్నాడని చెప్పారు. మావోయిస్టులకు అవసరమైన కంప్యూటర్ లు ఆయుధాల ఏర్పాటు చేయడంలో కాశీం దిట్ట అంటూ సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు.

అని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే కాసిం అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులకు ఎన్క్రిప్తెడ్ విధానంలో సమాచారం చేరవేస్తూ ఉన్నాడని పోలీసులు వివరించారు. మావోయిస్ట్ నియామకాల్లో కాశీం ది కీలక పాత్ర అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. అతని వద్ద కీలక సమాచారాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news