కొత్త దారులు వెతుకుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్…!

-

కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లు మూత బడ్డాక, ఓటీటీ బిజినెస్‌ పెరిగిపోయింది. స్కూల్లు, కాలేజీలు లేకపోవడంతో ఓటీటీ సబ్‌స్క్రైబర్స్‌గా మారిపోయారు స్టూడెంట్స్. అయితే కోవిడ్‌ దయతో పెరిగిన ఈ బిజినెస్‌లో మరిన్ని లాభాలు అందుకోవడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్.

ఇప్పటి వరకు ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే, ఈ ప్యాకేజ్‌ అయిపోయేంతవరకు అందులోని కంటెంట్‌ని చూసేవాళ్లం. కానీ ఫ్యూచర్‌లో ఇలాంటి ఆప్షన్‌ ఉండకపోవచ్చు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఓటీటీలో కూడా పే పర్‌ వ్యూ పద్దతి రాబోతోందని చెప్తున్నారు విశ్లేషకులు. తమిళ ఫిల్మ్ ‘రణసింగం’, హిందీ మూవీ ‘ఖాలీ పీలి’ రెండిటిని పే పర్ వ్యూలోనే రిలీజ్ చేసింది జీ-ఫైవ్‌. ‘రణసింగం’కి 199 రూపాయలు పెడితే, ‘ఖాలీ పీలి’కి 299 పెట్టింది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నాక కూడా ఎక్స్‌ట్రా పే చెయ్యాలంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారా.. సినిమాలు చూస్తారా అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారుతోంది.

ప్రొడ్యూసర్స్‌తోనూ కొత్త కొత్త డీల్స్‌ పెట్టుకుంటున్నాయట ఓటీటీ సంస్థలు. ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో, మినిమం గ్యారెంటీ లాంటి కాన్సెప్టులని పట్టుకొస్తున్నాయట. అలాగే సినిమా వ్యూస్‌ని బట్టి డబ్బులు ఇచ్చే ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేద్దామంటున్నారట. ఈ డీల్స్‌పై చాలామంది నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మీ సినిమాలు మాకివ్వండి మాకివ్వండి అని పోటీ పడిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు థియేటర్లు మూతబడ్డాయని బేరాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news