కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల ఆదాయం స్థానికంగానే వ్యయం అని అన్నారు. ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడదు అని ఆయన స్పష్టం చేసారు. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలి అని సూచించారు. ఆ ఉద్యోగుల జీత భత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది అని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలలో శానిటేషన్ పక్కాగా ఉండాలి అని ఆదేశాలు ఇచ్చారు. వాటర్, సీవరేజీ కూడా సక్రమంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ వద్దు అని స్పష్టం చేసారు. మున్సిపాలిటీలలో సంస్కరణలపై అడుగులు వేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్సా సత్యనారాయణ, సిఎస్ నీలం సహాని ఇతర అధికారులు పాల్గొన్నారు.