Most Eligible Bachelor: యంగ్ హీరో అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. వరస అపజయాల మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో అఖిల్ తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ లో ఈ విజయం కీలకంగా మారింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథను తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆహా లో నవంబర్ 12న అంటూ వార్తలు వెల్లువెత్తున్నాయి సోషల్ మీడియా లో. అయితే.. ఈ వార్తలపై నిర్మాత ఎస్ కె ఎన్ క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని..స్ట్రీమింగ్ కి ఇంకా చాలా సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుందని తెలిపారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని తెలిపారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ డే నే దుమ్ము లేపింది. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన తొలి రోజే.. ఏపీ , తెలంగాణలోఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్గా 18.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మరి రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో కలెక్షన్స్ ఉండనున్నాయో చూడాలి.