భార‌త్‌లో ముందుగా ల‌భించేది ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సినే..?

-

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశంలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలోని రెండు హాస్పిట‌ల్స్‌లో మ‌రో వారం రోజుల్లో ఫేజ్ 2 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా మొత్తం 1600 మంది వాలంటీర్ల‌కు వ్యాక్సిన్ ఇచ్చి ప‌రీక్ష‌లు చేస్తారు.

oxford vaccine may be the first vaccine for indians

అయితే భార‌త ప్ర‌జ‌ల‌కు ముందుగా ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సినే అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్‌కు ఇప్ప‌టికే ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయి. క‌నుక భార‌త్‌లో నేరుగా ఫేజ్ 2, 3 ట్ర‌య‌ల్స్ చేప‌డుతున్నారు. ఆ ట్ర‌య‌ల్స్ చాలా త్వ‌ర‌గా పూర్త‌వుతాయి క‌నుక‌.. ముందుగా ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సినే మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు కంపెనీలైన భార‌త్ బ‌యోటెక్‌, జైడ‌స్ కాడిలాలు కూడా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నాయి కానీ.. అవింకా ఫేజ్ 1 ద‌శ‌లోనే ఉన్నాయి. అందువ‌ల్ల మ‌న‌కు ఆక్స్‌ఫ‌ర్డ్ టీకానే ముందుగా ల‌భిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు.

కాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి చేసేందుకు ఇప్ప‌టికే ఆస్ట్రాజెనెకా సంస్థ‌తో ఒప్పందం కుద‌ర్చుకుంది. అలాగే సీర‌మ్ ఇనిస్టిట్యూట్ తాను నెల నెలా ఉత్ప‌త్తి చేసే వ్యాక్సిన్‌లో స‌గం వ్యాక్సిన్‌ను భార‌త్‌కే కేటాయిస్తామ‌ని చెప్పింది. దీంతో ఆ వ్యాక్సిన్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news